తమిళనాడులో భారీ వర్షాలు.. తంజావూరు జిల్లాలో స్కూళ్లకు సెలవులు
- తమిళనాడు-శ్రీలంక తీరంలో అల్పపీడనం
- తమిళనాడు వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు
- 11 జిల్లాలకు యెల్లో అలెర్ట్
తమిళనాడు, శ్రీలంక తీరంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాగపట్టణంలో పాఠశాలలు, కళాశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. తిరువారూరులో పాఠశాలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 11 జిల్లాలకు వాతావరణశాఖ యెల్లో అలెర్ట్ జారీ చేసింది.
కాగా, వాయవ్య భారతదేశంలో ఈ నెలలో సాధారణ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. రానున్న రోజుల్లో చలిగాలుల ప్రభావం తగ్గుతుందని పేర్కొంది.