వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డికి బెదిరింపులు.. వైరల్ అవుతున్న ఆడియో!
- కోటంరెడ్డికి ఫోన్ చేసి బెదిరించిన కడప జిల్లాకు చెందిన అనిల్
- జగన్ జోలికొస్తే బండికి కట్టుకుని నెల్లూరు అంగళ్ల మధ్య నుంచి లాక్కెళ్తానని హెచ్చరిక
- నీ కథ మొత్తం నాకు తెలుసంటూ బెదిరింపులు
తనకు తాను వైసీపీ మద్దతుదారుడిగా చెప్పుకున్న అనిల్.. ‘నీ కథ మొత్తం నాకు తెలుసు. నీ తమ్ముడు కూడా నీ కంటే ఎక్కువగా మాట్లాడుతున్నాడు. మీ ఇద్దరినీ ప్రజలు తరిమికొడతారు. డేట్ ఫిక్స్ చేసుకో. నీ ఇంటికి వచ్చి కట్టుకుని పోతా’ అని తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. ముఖ్యమంత్రిని తాను ఏమీ అనలేదని ఎమ్మెల్యే చెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా అనిల్ బెదిరింపులకు దిగాడు. ఈ విషయం చెబుతూ కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.