దిల్ రాజు చేతుల మీదుగా 'తెలుసా మనసా' ఫస్టు లుక్ పోస్టర్ రిలీజ్!
- స్వచ్ఛమైన ప్రేమకథా చిత్రంగా 'తెలుసా మనసా'
- పార్వతీశం - జశ్విక జంటగా నటించిన చిత్రం
- సంగీతాన్ని సమకూర్చుతున్న గోపీసుందర్
- దర్శకుడిగా వైభవ్ కి ఇది మొదటి సినిమా
అలాంటి ప్రేమకథల్లో ఒకటిగా 'తెలుసా మనసా' సినిమా రూపొందింది. పార్వతీశం - జశ్విక జంటగా నటించిన ఈ సినిమాను వర్ష - మాధవి నిర్మించారు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి, వైభవ్ దర్శకత్వం వహించాడు. ఇది ఒక స్వచ్ఛమైన .. ప్రతిఫలాపేక్షలేని ప్రేమకథ అంటూ మేకర్స్ మరింత ఆసక్తిని పెంచారు.
కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి దిల్ రాజు చేతుల మీదుగా ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. హీరో ఫ్యామిలీ ఏదో విషయంపై ఆలోచిస్తూ దిగాలుగా కూర్చోవడం ఈ పోస్టర్లో కనిపిస్తోంది. రోహిణి హట్టంగిడి కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
.