మా బడ్జెట్ ప్రాధాన్యతా అంశాలు ఇవే: నిర్మలా సీతారామన్
- పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి
- ప్రపంచం మందగమనంలో ఉన్నా మన దేశం వృద్ధిలో ఉందన్న మంత్రి
- 7 అంశాల ప్రాతిపదికన బడ్జెట్
ప్రపంచమంతటా మందగమనం ఉన్నప్పటికీ మన దేశంలో వృద్ధి అంచనా దాదాపు 7 శాతంగా ఉందని మంత్రి నిర్మల చెప్పారు. కరోనా కష్టాల నుంచి వేగంగా తేరుకుంటున్నామని, ఈ ఏడాదితో వాటన్నింటినీ గట్టెక్కుతామని తెలిపారు. ప్రపంచ దేశాలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో మన దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు.
తన ప్రసంగంలో ప్రస్తుత బడ్జెట్ ప్రాధాన్యతాంశాలను వివరించారు. సప్తరుషుల రీతిలో 7 అంశాల ప్రాతిపదికన ఈ బడ్జెట్ రూపొందించినట్టు వెల్లడించారు. సమ్మిళిత వృద్ధి, దేశంలో చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు, మౌలిక సదుపాయాలు-పెట్టుబడులు, యువశక్తి, ఆర్థిక రంగ బలోపేతం, గ్రీన్ ఎనర్జీ, రైతులు-మహిళలు-వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.