తారకరత్నను కాపాడిన డాక్టర్లకు కృతజ్ఞతలు: చిరంజీవి భావోద్వేగం
- తారకరత్న కోలుకుంటున్నాడనే మాట ఉపశమనాన్ని ఇచ్చిందన్న చిరంజీవి
- పూర్తి స్థాయిలో కోలుకుని, త్వరగా ఇంటికి రావాలని కోరుకుంటున్నానన్న మెగాస్టార్
- తారకరత్నకు సంపూర్ణమైన జీవితం ఉండాలని ఆకాంక్షించిన చిరు
మరోవైపు తారకరత్న గురించి మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగంతో స్పందించారు. సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు, ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. ఆయన త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలనుకుంటున్నానని చెప్పారు. తారకరత్నను ఈ పరిస్థితి నుంచి కాపాడిన డాక్టర్లకు, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. 'డియర్ తారకరత్న నీకు సంపూర్ణమైన, ఆరోగ్యవంతమైన జీవితం ఉండాలి' అని ఆకాంక్షించారు.