లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. అదానీ గ్రూపు షేర్లకు ఈరోజు కూడా నష్టాలే

Markets ends in profits
  • 170 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 45 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • నాలుగున్నర శాతానికి పైగా లాభపడ్డ బజాజ్ ఫైనాన్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 170 పాయింట్లు లాభపడి 59,500కి పెరిగింది. నిఫ్టీ 45 పాయింట్లు పుంజుకుని 17,649 వద్ద స్థిరపడింది. ఐటీ, టెక్, టెలికామ్ సూచీలు లాభాలను ముందుండి నడిపించాయి. అదానీ గ్రూపు షేర్లు ఈ రోజు కూడా పతనమయ్యాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (4.61%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.51%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.22%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.85%), ఎన్టీపీసీ (1.53%). 

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-3.38%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.56%), ఎల్ అండ్ టీ (-2.11%), టాటా స్టీల్ (-1.62%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.55%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News