ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి కన్నుమూత
- ఒడిశాలో మంత్రిపై కాల్పులు జరిపిన పోలీసు అధికారి
- చికిత్స పొందుతూ మృతి చెందిన మంత్రి నబకిశోర్ దాస్
- ఛాతీలో రెండు బుల్లెట్ గాయాలు
- అపోలో ఆసుపత్రి వైద్యుల శ్రమ నిష్ఫలం
ఝూర్సుగూడ జిల్లా బ్రిజ్ రాజ్ నగర్ లో ఈ ఘటన జరగ్గా, బుల్లెట్ గాయాలకు గురైన మంత్రి ఎయిర్ లిఫ్ట్ ద్వారా భువనేశ్వర్ తరలించారు. మంత్రి ప్రాణాలు కాపాడేందుకు భువనేశ్వర్ లోని అపోలో ఆసుపత్రి వైద్యులు తీవ్రంగా శ్రమించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు.
అటు, కాల్పులు జరిపిన ఏఎస్ఐ గోపాలచంద్ర దాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల ఘటనపై ఒడిశా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.