Currency Notes: బెంగళూరులో నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల వర్షం... వీడియో ఇదిగో!

Man throws currency notes in Bengaluru
షార్ట్స్‌లో చూడండి
బెంగళూరులో ఆశ్చర్యకర సంఘటన జరిగింది. నగరంలో నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. కేఆర్ మార్కెట్ వద్ద సిర్సి సర్కిల్ ఫ్లై ఓవర్ పైనుంచి ఓ వ్యక్తి కరెన్సీ నోట్లు జనంపైకి విసిరేశాడు. ఆ నోట్లను అందుకునేందుకు ప్రజలు పోటీలు పడ్డారు. వాహనాలు ఆపి మరీ రోడ్డుపై నోట్ల వేట సాగించారు. దాంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 

నోట్లు విసిరిన వ్యక్తి సూటుబూటు ధరించి మెడలో ఓ గోడ గడియారాన్ని తగిలించుకుని విచిత్ర వేషధారణతో కనిపించాడు. చేతి సంచి నిండా ఉన్న కరెన్సీ నోట్లను ఫ్లై ఓవర్ పైనుంచి వెదజల్లుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.  కాగా, ఆ వ్యక్తి వెదజల్లింది రూ.10 నోట్లు అని తెలుస్తోంది.
Go Back to Shorts
Currency Notes
Fly Over
KR Market
Bengaluru

More Telugu News