Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరోసారి వార్తల్లోకి ఎక్కిన డేరా బాబా

Dera Baba cuts cake with big sword
Advertisement
  • పెరోల్ పై బయటకు వచ్చిన గుర్మీత్ రామ్ రహీం బాబా
  • భారీ కేక్ ను పెద్ద కత్తితో కట్ చేసిన వైనం
  • సెలెబ్రేట్ చేసుకోవడానికి ఐదేళ్ల తర్వాత అవకాశం వచ్చిందని వ్యాఖ్య
Advertisement
రేప్, మర్డర్ కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం బాబా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. హర్యానాలోని రోహ్తక్ జిల్లాలో ఉన్న సునారియా జైల్లో ఆయన శిక్షను అనుభవిస్తున్నారు. ఒక కార్యక్రమం కోసం ఆయన 40 రోజుల పెరోల్ పై జైలు నుంచి గత శనివారం బయటకు వచ్చారు. జైలు నుంచి ఆయన నేరుగా ఉత్తరప్రదేశ్ లోని భాగ్ పట్ లో ఉన్న బర్నవా ఆశ్రమానికి వెళ్లారు.

 ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన వేడుకలో ఒక భారీ కేకును ఆయన పెద్ద కత్తితో కట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేక్ కట్ చేస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కూడా వీడియోలో వినిపిస్తున్నాయి. 'ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఐదేళ్ల తర్వాత అవకాశం వచ్చింది. నేను కనీసం ఐదు కేకులను కట్ చేయాలి. ఇది తొలి కేక్' అని డేరా బాబా అన్నారు. ఆయుధాల చట్టం ప్రకారం బహిరంగంగా ఆయుధాలను ప్రదర్శించడం నిషేధం అనే విషయం గమనార్హం. 

మరోవైపు, గత 14 నెలల సమయంలో డేరా బాబా జైలు నుంచి పెరోల్ పై బయటకు రావడం ఇది నాలుగోసారి. గత మూడు నెలల్లో బయటకు రావడం ఇది రెండోసారి. ఒక భారీ పారిశుద్ధ్య క్యాంపెయిన్ ను నిన్న డేరాబాబా వర్చువల్ గా ప్రారంభించారు. హర్యానాతో పాటు మరి కొన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆయన అనుచరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో హర్యానాకు చెందిన రాజ్యసభ సభ్యుడు క్రిషన్ లాల్ పణ్వార్, మాజీ మంత్రి క్రిషన్ కుమార్ బేడీ కూడా పాల్గొన్నారు.
Advertisement
Advertisement
Dera Baba
Cake
Parole

More Telugu News