ఇదంతా బాలయ్య బాబు లీల: 'వీరసింహారెడ్డి ' సెలబ్రేషన్స్ లో సాయిమాధవ్ బుర్రా
- సంక్రాంతి బరిలో హిట్ కొట్టిన 'వీరసింహారెడ్డి'
- హైదరాబాదులో నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్
- కొన్ని డైలాగ్స్ బాలయ్యే చెప్పాలన్న సాయిమాధవ్ బుర్రా
- తన ముచ్చట తీరిందంటూ హర్షం
"ఈ సినిమాకి పని చేయడం మొదలుపెట్టిన ప్రతి ఒక్కరూ బాలయ్య బాబు మాదిరిగా మారిపోయారు. ఆయన మాదిరిగానే ఆలోచించడం మొదలెట్టారు .. అందువల్లనే ఈ సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది. నా డైలాగులు బాగున్నాయనే దానికంటే, అవి బాలయ్య బాబు చెప్పడం వలన ఆ ఎఫెక్ట్ వచ్చిందని నేను అనుకుంటున్నాను"అన్నారు.
" కొన్ని డైలాగులు ఆయన చెబితేనే బాగుంటాయి .. ఆయన చెబితేనే పేల్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదంతా బాలయ్య లీల అంతే . ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కాంబినేషన్లో బాలయ్యకి ఒక్క డైలాగ్ కూడా ఉండదు. అదే ఇంకో హీరో అయితే ఒప్పుకోడు. ఒక్క ఎక్స్ ప్రెషన్ తోనే ఆ సీన్స్ లో ఆయన గెలిచారు" అంటూ చెప్పుకొచ్చారు.