mihos: మిహోస్ ఈ-బైక్ బుక్సింగ్స్ ను ప్రారంభించిన కంపెనీ.. త్వరపడండి!

  • తొలి 5 వేల మంది కస్టమర్లకు తగ్గింపు ధర
  • బుకింగ్ కోసం రూపాయి కూడా చెల్లించక్కర్లేదు
  • మార్చి నుంచి డెలివరీ అందిస్తామంటున్న కంపెనీ
bookings open for mihos e bike

అదిరిపోయే స్పీడ్ తో మార్కెట్లోకి వస్తున్న హై స్పీడ్ ఈ-బైక్ మిహోస్ బుకింగ్స్ ను కంపెనీ ప్రారంభించింది. ఆదివారం (జనవరి 22) నుంచి బుకింగ్స్ ఓపెన్ చేసినట్లు పేర్కొంది. కంపెనీ వెబ్ సైట్ ద్వారా లేదా దగ్గర్లోని కంపెనీ షోరూంకు వెళ్లి ఈ-బైక్ ను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. తొలి 5 వేల మంది కస్టమర్లకు రూ.1,49,000 (ఎక్స్ షోరూం) లకు బైక్ ను అందజేస్తామని తెలిపింది. అంటే.. తర్వాత ఈ బైక్ ధర పెరగనుందని అర్థం చేసుకోవచ్చు. ఈ-బైక్ ను బుక్ చేసుకోవడానికి రూపాయి కూడా చెల్లించక్కర్లేదని కంపెనీ పేర్కొంది. ఉచితంగానే బుక్ చేసుకోవచ్చని, ఇప్పుడు బుక్ చేసుకున్న కస్టమర్లకు మార్చి నుంచి బైక్ లు డెలివరీ చేస్తామని వివరించింది.

భారత దేశంలోని రోడ్లకు అనుగుణంగా ఈ ఎలక్ట్రిక్ బైక్ ను తయారుచేసినట్లు కంపెనీ తెలిపింది. బైక్ లో గ్రౌండ్ క్లియరెన్స్ 175 ఎం.ఎం. సైడ్ స్టాండ్ సెన్సర్, హైడ్రాలిక్ కాంబి బ్రేకింగ్ సిస్టమ్, బ్యాటరీ స్టేటస్, ట్రాకింగ్, జీపీఎస్, యాంటీ థెఫ్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా రివర్స్ మోడ్ తో పాటు బ్లూటూత్ మ్యూజిక్ ప్లేయింగ్, కీ లెస్ స్టార్టింగ్ సదుపాయం కూడా ఉందని కంపెనీ వివరించింది. ప్రస్తుతం బ్లూ, బ్లాక్, యెల్లో, వైట్ రంగుల్లో ఈ స్కూటర్ ను తయారుచేస్తున్నట్లు వార్డ్‌విజర్డ్‌కు చెందిన ఎలక్ట్రిక్ టూవీలర్ల తయారీ కంపెనీ జాయ్ ఇ బైక్ వెల్లడించింది. బైక్ స్టార్ట్ చేసిన 7 సెకన్లలోపే గంటకు 40 కిలోమీటర్ల స్పీడ్ ను అందుకునేలా ఈ బైక్ ను తీర్చిదిద్దినట్లు పేర్కొంది.

More Telugu News