15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలు ఏప్రిల్ 1 నుంచి ఇక తుక్కుకే!
- వాటి రిజిస్ట్రేషన్లను ఉపసంహరించాలని నిర్ణయం
- ఏప్రిల్ 1 నుంచి పాలసీ అమల్లోకి
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాహనాలకు వర్తింపు
2021-22 కేంద్ర బడ్జెట్ లోనే ఈ విధానాన్ని పేర్కొంది. ఈ విధానం మేరకు వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్ల తరువాత, వాణిజ్య వాహనాలకు 15 ఏళ్ల తరువాత ఫిట్ నెస్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలి. ఫిట్ నెస్ లభించని వాహనాలను తుక్కు కోసం ఇవ్వాల్సి ఉంటుంది. పాత వాహనాలను తుక్కుగా మార్చిన తరువాత వాటి యజమానులు కొనుగోలు చేసే కొత్త వాహనాలకు రహదారి పన్నులో 25 శాతం వరకూ రాయితీ ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది.