రిలయన్స్ జియో నుంచి రెండు కొత్త ప్లాన్లు
- రూ.349 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు
- రూ.899 ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు
- రెండింటిలోనూ ప్రయోజనాలన్నీ ఒక్కటే
- వీటితో 5జీ సేవలు పొందే అవకాశం
రూ.899 రీచార్జ్ ప్లాన్ లోనూ రోజువారీ 2.5 జీబీ ఉచిత డేటా లభిస్తుంది. అలాగే, ఉచిత కాల్స్, రోజువారీ 100 ఉచిత ఎస్ఎంఎస్ ప్రయోజనాలు పొందొచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ సేవలు ఉచితంగా పొందొచ్చు. ఈ ప్లాన్ లోనూ 5జీ సేవలు వినియోగించుకోవచ్చు. మరోవైపు రిలయన్స్ జియో ఇప్పటి వరకు 100కు పైగా పట్టణాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుమల, తిరుపతి, నెల్లూరు, ఏలూరు పట్టణాల్లో జియో 5జీ సేవలు వినియోగించుకోవచ్చు.