ప్రోటోకాల్ పై కేసీఆర్ స్పందించాకే రాష్ట్ర ప్రభుత్వ ప్రశ్నలకు సమాధానం చెబుతా: గవర్నర్ తమిళిసై
- బీఆర్ఎస్ సర్కార్ వర్సెస్ తమిళిసై
- గత కొన్నాళ్లుగా మాటల యుద్ధం
- గవర్నర్ పదవిని కేసీఆర్ అవమానించారన్న తమిళిసై
- ఎలా అవహేళన చేస్తారంటూ ఆగ్రహం
- తనకు ప్రోటోకాల్ తెలుసని స్పష్టీకరణ
తాను 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, తనకు ప్రోటోకాల్ తెలుసని తమిళిసై అన్నారు. ప్రోటోకాల్ పై కేసీఆర్ స్పందించాకే రాష్ట్ర ప్రభుత్వ ప్రశ్నలకు సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. రిపబ్లిక్ డే అంశంపై తనకు సమాచారం లేదని ఆమె తెలిపారు.