చివరి నిజాంకు నివాళి అర్పించిన కేసీఆర్.. ఫొటోలు ఇవిగో
- శనివారం రాత్రి ఇస్తాంబుల్ లో కన్నుమూసిన ముకర్రమ్ జా
- రేపు మక్కా మసీదులో అంత్యక్రియలు
- నిజాం కుటుంబ సభ్యులను పరామర్శించిన కేసీఆర్
మరోవైపు ముకర్రమ్ జా చివరి కోరిక మేరకు ఆయన అంత్యక్రియలను చార్మినార్ పక్కనున్న మక్కా మసీదులో నిర్వహించనున్నారు. అక్కడే ఆయనను ఖననం చేయనున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఉంచుతారు. మధ్యాహ్నం 2 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.


