పవన్ కల్యాణ్ సినిమాలో అవకాశం వచ్చినా చేయను: ప్రియాంక జవాల్కర్
- పవన్ కు అభిమానిగానే ఉండిపోతానన్న ప్రియాంక
- ట్యాక్సీవాలాతో మెప్పించిన జవాల్కర్
- తర్వాత చిన్న చిత్రాలతో నెట్టుకొస్తున్న తెలుగు నటి
అయితే, ఏకంగా పవన్ సినిమాలో చాన్స్ వచ్చినా చేయను అనడానికి బలమైన కారణమే ఉందని ప్రియాంక చెబుతోంది. తనకు పవన్ కల్యాణ్ అంటే పిచ్చి అని, ఆయన నటించిన తమ్ముడు సినిమాను 20 సార్లు చూశానని ఆమె చెప్పింది. ఖుషీ సినిమాలో ప్రతీ డైలాగ్ కూడా తనకు గుర్తుందంటోంది. పవన్ కు తాను అభిమానినని, ఆయనని దూరం నుంచి చూస్తూ, అభిమానిస్తూ ఉండిపోవాలని అనుకుంటున్నట్టు తెలిపింది. అంతకు మించి ఏమీ కోరుకోవడం లేదని, ఒకవేళ ఆయన సినిమాలో అవకాశం వచ్చినా చేయనని చెప్పింది. అంత పెద్ద స్టార్ అయినా కూడా పవన్ అంత సింపుల్గా ఎలా ఉంటారో తనకు అర్థం కాదని చెప్పింది.