మథురలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై ఇద్దరు బాలుర అత్యాచారం.. వీడియో తీసి బ్లాక్‌మెయిల్!
- ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి పాల్పడిన బాలురు
- విషయం ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని హెచ్చరిక
- పొరిగింటి అబ్బాయిలే నిందితులు
వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు. బాధిత బాలిక కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయం తెలుసుకున్న పొరుగింట్లో ఉన్న ఇద్దరు బాలురు ఇంట్లోకి చొరబడి బాలికను వేధించడం మొదలుపెట్టారు. ఆమె ప్రతిఘటించడంతో అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను వీడియో తీసిన మైనర్లు విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బాలికను బెదిరించారు.