కరోనా కొత్త వేరియంట్ల విజృంభణ... తాజా మార్గదర్శకాలు జారీ చేసిన డబ్ల్యూహెచ్ఓ
- పలు దేశాల్లో ఇంకా తగ్గని కరోనా ఉద్ధృతి
- లక్షణాలు ఉంటే 10 రోజుల ఐసోలేషన్
- లక్షణాలు లేకుండా పాజిటివ్ వస్తే 5 రోజుల ఐసోలేషన్
- బూస్టర్ డోసు తీసుకోవాలన్న డబ్ల్యూహెచ్ఓ
ఈ నేపథ్యంలో, డబ్ల్యూహెచ్ఓ తాజాగా పలు మార్గదర్శకాలు జారీ చేసింది.
కరోనా పాజిటివ్ వచ్చిన బాధితుల్లో లక్షణాలు కనిపిస్తే వారు 10 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలి. కరోనా పాజిటివ్ వచ్చినా లక్షణాలు లేకపోతే 5 రోజులపాటు ఐసోలేషన్ లో ఉండాలి. బాధితుడికి యాంటీజెన్ టెస్టులో నెగెటివ్ వస్తే ఐసోలేషన్ నుంచి బయటికి రావొచ్చు. పరిస్థితులతో సంబంధం లేకుండా, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. కరోనా రోగుల చికిత్సలో నిర్మాట్రెల్విర్-రిటోనావిర్ ఔషధాల వినియోగాన్ని కొనసాగించాలని పేర్కొంది. అంతేకాదు, కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు కూడా తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.
ఇటీవల కరోనా కొత్త వేరియంట్లు పలు దేశాల్లో వెలుగు చూడడం కూడా డబ్ల్యూహెచ్ఓను అప్రమత్తం చేసింది. చైనాలో ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ తో పాటు పలు దేశాల్లో ఎక్స్ బీబీ.1.5 వేరియంట్ అత్యధిక కేసులకు కారణమవుతోంది.