విజయవాడ చేరుకున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్... చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు
- వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
- సికింద్రాబాద్ నుంచి బయల్దేరిన రైలు
- వరంగల్, ఖమ్మం మీదుగా విజయవాడ చేరిక
- రైలు రాకను ఫోన్లలో చిత్రీకరించిన ప్రజలు
ఈ రైలు రాకతో విజయవాడ స్టేషన్ లో కోలాహలం నెలకొంది. ఈ అత్యాధునిక ట్రైన్ ను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. తమ ఫోన్లలో వందేభారత్ రైలు రాకను చిత్రీకరించారు.
ఈ రైలు సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకోనుంది. తెలంగాణలో వరంగల్ ఖమ్మం... ఏపీలో విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది.