nepal: నేపాల్ లో కుప్పకూలిన విమానం.. వీడియో ఇదిగో

plane crashed in nepal airport runway
షార్ట్స్‌లో చూడండి
నేపాల్ లో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విమానాశ్రయంలో రన్ వేపై ఓ విమానం కుప్పకూలింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు యతి ఎయిర్ లైన్స్ ప్రతినిధి తెలిపారు. ప్రయాణికులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

దేశ రాజధాని ఖాట్మాండు నుంచి పొఖారాకు బయలుదేరిన యతి ఎయిర్ లైన్స్ విమానం ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం రన్ వే పై కూలిపోవడంతో పొఖారా ఎయిర్ పోర్టును అధికారులు మూసివేశారు. విమానంలో ఉన్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అయితే, ఈ ప్రమాదానికి కారణం కానీ, ప్రమాదంలో మరణించిన వారి వివరాలను కానీ ప్రభుత్వం వెల్లడించలేదు. ప్రాణనష్టం భారీగా ఉండే అవకాశం ఉందని అధికారవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Go Back to Shorts
nepal
plane crash
68 passengers
runway crash
yati airlines
nepal plane crash

More Telugu News