చైనాలో 90 కోట్ల మందికి కరోనా
- ఈ నెల 11 నాటికి 90 కోట్ల మందికి కరోనా
- దేశ జనాభాలో 64 శాతం మందికి వైరస్
- కరోనా కొత్త వేవ్ మరో మూడు నెలలు కొనసాగే అవకాశం
మరోవైపు ఈ నెల 23న చైనా కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది. ఈ నేపథ్యంలో నగరాలు, పట్టణాల్లో ఉన్న లక్షలాది మంది ప్రజలు తమ సొంత గ్రామాలకు తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు కరోనా కొత్త వేవ్ మరో రెండు నుంచి మూడు నెలల పాటు కొనసాగే అవకాశం ఉందని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మాజీ చీఫ్ జెంగ్ గువాంగ్ తెలిపారు.