డబ్బులిచ్చి మరీ జాతీయ జట్టుకు ఆడుతున్నారట.. వేల్స్ హాకీ ఆటగాళ్ల దుస్థితి!
- హాకీ ప్రపంచ కప్ లో పాల్గొంటున్న వేల్స్ వింత పరిస్థితి
- ఆ దేశంలో హాకీకి ఆదరణ, ప్రోత్సాహం కరవు
- విరాళాలతో భారత్ కు వచ్చిన వైనం
ఈ విషయాన్ని ఆ జట్టు కోచ్ డేనియల్ న్యూకోంబె తెలిపారు. తమ దేశంలో హాకీకి అంతగా ఆదరణ, ప్రాచుర్యం లేకపోవడం ఇందుకు కారణమని అన్నారు. దాంతో, ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహకారం లభించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో భారత్ వచ్చేందుకు విమాన ప్రయాణం, వసతి, భోజన ఖర్చుల కోసం ప్రజల నుంచి విరాళాల రూపంలో 25 వేల పౌండ్లు సేకరించారు. ప్రపంచ కప్ తర్వాత అయినా తమ జట్టుకు ఆదరణ లభిస్తుందని కోచ్ డేనియల్ ఆశిస్తున్నారు. కాగా, ఈ టోర్నీలో వేల్స్.. భారత్, స్పెయిన్, ఇంగ్లండ్ తో కలిసి గ్రూప్–డి బరిలో నిలిచింది.