రూ.8,000కే యాపిల్ ఎయిర్ పాడ్స్
- తక్కువ ధరకు వేరియంట్ ను తీసుకురావడంపై దృష్టి
- 2024 చివర్లో విడుదల చేసే అవకాశాలు
- ప్రముఖ అనలిస్ట్ మింగ్ చీ కువో అంచనా
కొత్తగా తీసుకొచ్చే ఎయిర్ పాడ్స్ ధర రూ.8,000 ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఎయిర్ పాడ్స్ తక్కువకు కావాలంటే రెండో జనరేషన్ కోసం రూ.14,900 వెచ్చించాల్సి వస్తోంది. గతేడాది యాపిల్ విడుదల చేసిన మూడో జనరేషన్ ఎయిర్ పాడ్స్ ధర రూ.19,900. యాపిల్ ఎయిర్ పాడ్స్ సరఫరాదారులను మార్చొచ్చనే అంచనాలు సైతం వినిపిస్తున్నాయి. ఎయిర్ పాడ్స్ అంటే ఇష్టం ఉండి ధరను చూసి వెనక్కి తగ్గే వారికి.. చౌక ఎయిర్ పాడ్స్ మంచి ఆప్షన్ అవుతాయి. యాపిల్ సంస్థ ఆడియో మార్కెట్లో వాటాను కూడా పెంచుకోవచ్చు.