మైలవరంలో వేడెక్కిన రాజకీయం.. బాలయ్య, వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు
- వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం
- వెలగలేరులో బాలయ్య, కృష్ణ ప్రసాద్ ల భారీ ఫ్లెక్సీ
- తాను బాలయ్య అభిమానిని కావడంతోనే ఏర్పాటు చేశానన్న వైసీపీ గ్రామ నేత
- ఎమ్మెల్యేకు, దీనికి సంబంధం లేదని వివరణ
బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా విడుదల సందర్భంగా జి.కొండూరు మండలం వెలగలేరులో వీరి ఫొటోలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ విషయం కాస్తా చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో చర్చ మొదలైంది. ఈ ఫ్లెక్సీని చూసినవారు వైసీపీ ఎమ్మెల్యే పార్టీ మారడం పక్కా అని ఓ నిర్ణయానికి వచ్చేశారు.
గ్రామానికి చెందిన వైసీపీ నేత చల్లగుళ్ల అజయ్ కుమార్ ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. తాను బాలయ్య అభిమానిని కావడంతో ఎమ్మెల్యే ఫొటోతో కలిపి ఫ్లెక్సీని ఏర్పాటు చేశానని, అంతేకానీ, ఎమ్మెల్యేకు.. ఈ ఫ్లెక్సీకి ఎలాంటి సంబంధమూ లేదని ఆయన వివరణ ఇచ్చారు.