ఒక్కసారి చార్జింగ్ పెడితే వంద కిలోమీటర్ల మైలేజీ! తక్కువ ధరకే మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
- కబీరా కంపెనీ నుంచి కొలిజియో నియో స్కూటర్
- దీని ఆన్ రోడ్ ప్రైస్ రూ.49,200 అని వెల్లడి
- తక్కువ బరువు, వినూత్న డిజైన్ తో స్కూటర్ కు అదిరే లుక్
లైవ్ ట్రాకింగ్, ఇంటెలిజెంట్ యాంటీ థెఫ్ట్ అండ్ ఎస్ఓఎస్, ట్రిప్ హిస్టరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కొలిజియో స్కూటర్ ప్రత్యేకతలు..
- 48 వీ 24 ఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ (ఏడాది వారంటీతో)
- 250 వాట్ పవర్ సామర్థ్యంతో బీఎల్ డీసీ ఎలక్ట్రిక్ మోటార్
- కేవలం 4 గంటలలో బ్యాటరీ ఫుల్ చార్జింగ్.. ఆపై వంద కిలోమీటర్ల వరకు పరుగు
- టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు
- ముందు భాగంలో డిస్క్ బ్రేక్.. వెనక డ్రమ్ బ్రేక్, స్ప్రింగ్ టైప్ సస్పెన్షన్ సిస్టమ్
- రిమోట్ స్టార్ట్, పుష్ బటన్ స్టార్ట్ సౌకర్యం
- స్కూటీలో ఇన్ బిల్ట్ గా మొబైల్ యాప్
- ఎల్ఈడీ హెడ్ లైట్స్, టెయిల్ లైట్స్, టర్న్ సిగ్నల్ ల్యాంప్, లో బ్యాటరీ ఇండికేటర్