జీ2గా వస్తున్న గూఢచారి సీక్వెల్.. అదిరిపోయిన అడివి శేష్ ఫస్ట్ లుక్
- గూఢచారికి సీక్వెల్ ను ప్రకటించిన చిత్ర బృందం
- ముంబైలో ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసిన శేష్
- ప్రీ విజన్ వీడియో కూడా విడుదల
ఇందులో శేష్‌ను ఇండియా నుంచి ఆల్ప్స్ పర్వతాల వరకు వెళ్లే గూఢచారిగా చూపించారు. గూఢచారి తొలి భాగం హిట్ తో శేష్ కెరీర్ ఊపందుకోగా.. రెండో పార్టుతో తను మరో స్థాయికి చేరుకునేలా ఉన్నాడు. ఈ చిత్రం కోసం శేష్ ప్రత్యేకంగా మేకోవర్ అయి మరింత స్టయిలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్టు చిత్ర బృందం చెబుతోంది.
ఇక ఈ సీక్వెల్ కు శేష్ కథను అందించాడు. మేజర్ చిత్రానికి ఎడిటర్ గా పనిచేసిన వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా సినిమాను ఏకే ఎంటర్‌టైనమెంట్స్, పీపుల్ మీడియా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.