టీడీపీ నేత యరపతినేనిపై కేసు నమోదు

Police case against Yarapathineni Srinivas
  • పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
  • యరపతినేనితో పాటు మరో ఐదుగురిపై కేసు
  • కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ టీడీపీ శ్రేణుల మండిపాటు
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో ఐదుగురు టీడీపీ నేతలపై పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. కేసులో ఏ1గా యరపతినేని, ఏ2గా దియ్యా రామకృష్ణ పేర్లను పేర్కొన్నారు. దియ్యా రామకృష్ణ, ఇంతియాజ్ లను నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఈరోజు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు యరపతినేనిపై కేసు నమోదు కావడంపై టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరాయని మండిపడుతున్నాయి.
Go Back to Shorts
Yarapathineni Srinivasa Rao
Telugudesam
Police Case

More Telugu News