రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలపై కాపు సంఘాల ఫైర్
- బాబు-పవన్ కల్యాణ్ భేటీపై రాంగోపాల్ వర్మ ట్వీట్
- వర్మ ట్వీట్ వెనక వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించిన కాపు సంఘాల నేతలు
- కాపు మంత్రులు తమ జాతిని సీఎంకు తాకట్టుపెట్టారని మండిపాటు
ఈ సందర్భంగా కాపు ఐక్యనాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహన్రావు మాట్లాడుతూ.. చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీపై వర్మ ట్వీట్ వెనక వైసీపీ నేతల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కాపు మంత్రులు తమ జాతిని ముఖ్యమంత్రికి తాకట్టుపెట్టారని మండిపడ్డారు. కాపులపై కుట్రలో భాగంగానే ఆర్జీవీ ఈ ట్వీట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాపు నేతలు పాల్గొన్నారు.
కాగా, నిన్న రాంగోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. డబ్బు కోసం సొంత కాపులను అమ్మేస్తాడని తాను ఊహించలేదన్నారు. ‘రిప్ కాపులు.. కంగ్రాచ్యులేషన్స్ కమ్మోళ్లు’ అని ట్వీట్ చేశారు.