కుప్పంలో అక్రమ అరెస్టులను ఖండిస్తున్నా: చంద్రబాబు
- కుప్పంలో అరెస్టుల పర్వం అంటూ మీడియాలో వార్త
- పోలీసులు తప్పుడు ఎఫ్ఐఆర్ లు రాస్తున్నారన్న చంద్రబాబు
- రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలనకు నిదర్శనం అని విమర్శ
ఎఫ్ఐఆర్ లో 'ఇతరులు' అని పెట్టి... వైసీపీ నేతల సూచనల ప్రకారం టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఫిర్యాదులు చేసిన ఎస్ఐలు, సీఐలు, వెనకుండి కథ నడిపిస్తున్న డీఎస్పీలు, ఎస్పీలు తాము చేస్తున్న తప్పులకు తప్పక శిక్ష అనుభవిస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు.