యాపిల్ స్టోర్స్ ముందుగా ముంబై, ఢిల్లీలో ఏర్పాటు.. ఉద్యోగుల కోసం నోటిఫికేషన్
- పలు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న యాపిల్
- వారంలో 40 గంటల పాటు పనిచేయాలన్న షరతు
- స్థానిక భాషతోపాటు ఇంగ్లిష్ తెలిసి ఉండడం తప్పనిసరి
జీనియస్ పోస్ట్ ను కూడా ప్రకటించింది. కస్టమర్ల సాంకేతిక సమస్యలకు సమాధానం చెప్పడం వీరి పని. యాపిల్ ఉత్పత్తులకు సంబంధించి కస్టమర్ల ఎక్స్ పీరియన్స్ ను పెంచే విధంగా వీరు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వారంలో 40 గంటలు పని చేయాలని సంస్థ పేర్కొంది. రోజుకు ఎనిమిది గంటల చొప్పున అయితే 5 రోజులకు సమానం అవుతుంది. స్థానిక భాషల్లో ప్రావీణ్యంతో పాటు, ఇంగ్లిష్ ప్రావీణ్యం కూడా అవసరం. కాకపోతే ఈ ప్రకటనలో వేతన వివరాలు లేవు. ఢిల్లీలో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టోర్ ఏర్పాటు కానుండగా, ముంబైలో దాదాపు దీనికి రెట్టింపు సైజులో 22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్టోర్ రానుంది.