రామ్ గోపాల్ వర్మకు బుద్దా వెంకన్న సెటైర్

Budda Venkanna satire on Ram Gopal Varma
  • చంద్రబాబును కలిసిన పవన్ పై ఆర్జీవీ విమర్శలు
  • డబ్బు కోసం కాపులను అమ్మేశాడంటూ ట్వీట్
  • పేటీఎం డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదని వర్మపై వెంకన్న సెటైర్
టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన జనసేనాని పవన్ కల్యాణ్ పై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని కమ్మోళ్లకు అమ్మేస్తాడని తాను ఊహించలేదని అన్నారు. 'RIP కాపులు, కంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్లు' అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఘాటుగా స్పందించారు. 

కామంతో కాళ్ళు నాకావ్ అనుకున్నా, కానీ పేటీఎం డబ్బు కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదని వెంకన్న దెప్పిపొడిచారు. RIP రామ్ గోపాల్ వర్మ... కంగ్రాట్స్ జగన్ రెడ్డి అని ట్వీట్ చేశారు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సినీ నటి అషురెడ్డి కాళ్లను వర్మ నాకిన సంగతి తెలిసిందే. దీన్ని ఉద్దేశించే బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Ram Gopal Varma
Tollywood
Budda Venkanna
Telugudesam
Chandrababu
Pawan Kalyan
Janasena

More Telugu News