సానియా మీర్జా తాజా పోస్ట్ అర్థం ఏమిటో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సానియా మీర్జా తాజా పోస్ట్ అర్థం ఏమిటో!

Amid divorce rumours with Shoaib Malik Sania Mirza another cryptic note
  • ఇద్దరి మధ్య కొంత అంతరం
  • ఒకరిని దూరం పెట్టానంటే అది వారిలో తప్పున్నట్టు కాదన్న సానియా
  • వారి ప్రవర్తన తనకు నచ్చలేదని వివరణ
టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ వైవాహిక బంధం బీటలు వారినట్టు తెలుస్తోంది. వీరి మధ్య అనుబంధం ఇంతకుముందు మాదిరి లేదని సానియా మీర్జా సోషల్ మీడియా పోస్ట్ లు చూస్తే అర్థం చేసుకోవచ్చు. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొంత కాలం నుంచి ఒక ప్రచారం నడుస్తోంది. దీన్ని సానియా, షోయబ్ ఖండించలేదు. అలా అని ధ్రువీకరించలేదు. మౌన వ్రతాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో పనీ పాటలేని వారు మరింత కల్పిత ప్రచారం సృష్టించేందుకు అవకాశం ఇచ్చినట్టయింది. 

సానియా మీర్జా ఇటీవలే తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో ఓ ఆలోచనాత్మక పోస్ట్ పెట్టింది. ‘‘మా సరిహద్దులు అన్నవి ఇతరులు నిర్ణయించేవి కావు. వారు ఎంతో సులభంగా మా అవసరాలను నిర్ణయించేస్తున్నారు. నేను ఒకరితో దూరం పెంచుకున్నాను అంటే అది వారి తప్పు కాదు. కొన్ని సందర్భాల్లో వారి ప్రవర్తన నాకు సరిగ్గా అనిపించకపోవచ్చు’’ అని సానియా మీర్జా పేర్కొంది. అంటే తన భర్త షోయబ్ తో తనకు అంతరం ఏర్పడినట్టు ఆమె పరోక్షంగా అంగీకరించింది. అంతేకానీ, తాము విడిపోతున్నామని ఆమె ఎప్పుడూ చెప్పలేదు.
Advertisement
divorce rumours
Shoaib Malik
Sania Mirza

More Telugu News