చివరి టీ20లో ఘనంగా గెలిచిన టీమిండియా... సిరీస్ కైవసం
- రాజ్ కోట్ లో టీమిండియా వర్సెస్ శ్రీలంక
- 91 పరుగుల తేడాతో టీమిండియా విజయం
- సిరీస్ 2-1తో హస్తగతం
- ఈ నెల 10 నుంచి వన్డే సిరీస్
లంక బ్యాట్స్ మెన్ లో ఎవరూ చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేదు. కెప్టెన్ దసున షనక 23, ఓపెనర్ కుశాల్ మెండిస్ 23, ధనంజయ డిసిల్వా 22, చరిత్ అసలంక 19 పరుగులు చేశారు.
అంతకుముందు, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు భారీ స్కోరు నమోదు చేసింది. మిస్టర్ 360 బ్యాట్స్ మన్ సూర్యకుమార్ యాదవ్ లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. సూర్య 51 బంతుల్లో 112 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
ఈ మ్యాచ్ లో విజయంతో మూడు టీ20ల సిరీస్ ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. ఇక ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ ఈ నెల 10న గువాహటిలో జరగనుంది.