మార్చి నెలాఖరులో విశాఖ వేదికగా జీ20 దేశాల వర్కింగ్ గ్రూప్ సమావేశం
- భారత్ కు ఈ ఏడాది జీ20 కూటమి అధ్యక్ష బాధ్యతలు
- దేశంలో 200 సమావేశాలు
- మార్చి 28, 29 తేదీల్లో విశాఖలో సమావేశం
- 40 దేశాల నుంచి ప్రతినిధుల రాక
విశాఖలో రెండ్రోజుల పాటు జరిగే ఈ జీ20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు 40 దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. 300 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారు. దీనిపై ఏపీ మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి స్పందించారు. ఈ సమావేశాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రాన్ని, విశాఖ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు వివరించారు.