నాగశౌర్య జోడీగా పరిచయమవుతున్న అందాల మందారం!
- తెలుగు తెరపై కొత్త హీరోయిన్ల సందడి
- మోడలింగ్ వైపు నుంచి వచ్చిన మరో బ్యూటీ
- ఎస్.ఎల్.వి. బ్యానర్ తో టాలీవుడ్ కి పరిచయం
- ఈ రోజున బర్త్ డే జరుపుకుంటున్న బ్యూటీ
- శుభాకాంక్షలు అందజేసిన టీమ్
ఈ నేపథ్యంలోనే ఆయన ఎస్.ఎల్.వి. బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నాడు. క్రితం ఏడాది ఆగస్టులో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాతో పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది.
ఈ సినిమాతో యుక్తి తరేజా కథానాయికగా పరిచయం కానుంది. తను హర్యానా బ్యూటీ .. మోడలింగ్ మీదుగా సినిమాల్లోకి వచ్చింది. ఈ రోజున ఆమె బర్త్ డే కావడంతో, ఎస్.ఎల్.వి. సినిమాస్ టీమ్ గ్రీటింగ్స్ తెలియజేసింది. అందానికి ఆనవాలుగా కనిపించే ఈ సుందరి చూపులతోనే కట్టిపడేస్తోంది. ఈ సినిమా తరువాత ఇక్కడి యంగ్ బ్యూటీస్ కి గట్టి పోటీ ఇస్తుందేమో చూడాలి.