Pawan Kalyan: జగన్ కు పవన్ కల్యాణ్ బహిరంగలేఖ

Pawan Kalyan open letter to Jagan
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం ర్యాలీని పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. ఓదార్పు యాత్ర పేరుతో మీరు దశాబ్ద కాలం పాటు యాత్రలు, రోడ్ షోలు చేయవచ్చు కానీ... ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రతిపక్షాలు జనాల్లో తిరగొద్దా? అని ప్రశ్నించారు. 

ప్రతిపక్షాలు జనాల్లో తిరగడానికి అనుమతించకపోతే ఎలాగని ప్రశ్నించారు. మీరు అధికారంలో లేనప్పుడు ఒక రూలు, అధికారంలోకి వచ్చాక మరో రూలా? అని ప్రశ్నించారు. మరోవైపు పింఛన్లను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ సీఎం జగన్ కు పవన్ కల్యాణ్ బహిరంగలేఖ రాశారు. మీ పింఛన్లను ఎందుకు తొలగించకూడదో చెప్పాలంటూ 4 లక్షల మంది లబ్ధిదారులకు నోటీసులు ఇవ్వడం దారుణమని అన్నారు. 

Go Back to Shorts
Pawan Kalyan
Janasena
Jagan
YSRCP

More Telugu News