చంద్రబాబు కుప్పం పర్యటన.. శాంతిపురంలో భారీగా పోలీసుల మోహరింపు
- ప్రచార రథంతో పాటు సౌండ్ సిస్టం వాహనం సీజ్
- డ్రైవర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- వాహనాలు స్టేషన్ కు తరలింపు
కుప్పం పర్యటనలో భాగంగా కేనుమాకురిపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని టీడీపీ నేతలు తలపెట్టగా.. ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన స్టేజీని పోలీసులు తొలగించారు. చంద్రబాబు పర్యటన షెడ్యూల్ లోని అన్ని గ్రామాల్లో భారీగా సిబ్బందిని మోహరించారు. గ్రామగ్రామాన, కూడళ్లు పోలీసు వాహనాలు కనిపిస్తున్నాయి. కాగా, ఈ పర్యటన కోసం చంద్రబాబు ఇంకాసేపట్లో పెద్దూరు గ్రామానికి చేరుకుంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి.