ఒంగోలు వేదికగా 'వీరసింహారెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్!
- మాస్ యాక్షన్ మూవీగా 'వీరసింహారెడ్డి'
- బాలయ్య జోడీగా సందడి చేయనున్న శ్రుతి హాసన్
- ఆల్రెడీ జనంలోకి వెళ్లిన తమన్ మాస్ బీట్స్
- ఈ నెల 12వ తేదీన సినిమా విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వేదికను ఖరారు చేశారు. ఒంగోలులోని ఎ.ఎమ్.బి. కాలేజ్ గ్రౌండ్స్ లో, ఈ నెల 6వ తేదీన ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలుకానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను వదిలారు.
బాలకృష్ణ సరసన నాయికగా శ్రుతి హాసన్ అలరించనున్న ఈ సినిమాలో, ప్రతి నాయకుడిగా దునియా విజయ్ కనిపించనున్నాడు. రామ్ లక్ష్మణ్ ఫైట్స్ .. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. నందమూరి అభిమానులంతా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.