నాకు ఆయనతో నటించాలని ఉంది: త్రిష
- నాలుగు పదుల వయసులో కూడా దూసుకుపోతున్న త్రిష
- ప్రస్తుతం విజయ్, అజిత్ సరసన నటిస్తున్న అందాల భామ
- రజనీకాంత్ చిత్రంలో నటించాలనేది తన పూర్తి కోరిక అని వెల్లడి
తాజాగా ఒక ఇంటర్వ్యూలో త్రిష స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 'పొన్నియన్ సెల్వన్'లో తనకు అవకాశం ఇచ్చిన మణిరత్నంకు ధ్యవాదాలు తెలిపింది. ఇందులోని 'కుందవై' పాత్రకు తాను సరిపోతానా అనే సందేహం చాలా మందికి ఉండేదని... అలాంటిది, ఇప్పుడు తానే కుందవై అన్నంతగా ప్రేక్షకులు తనను భావించడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు మణిరత్నం, శరవణన్, గౌతమ్ మీనన్, ప్రేమ్ వంటి గొప్ప దర్శకుల చిత్రాల్లో తాను నటించడం ఆనందంగా ఉందని అన్నారు. అందరు అగ్ర హీరోలతో నటించానని... అయితే రజనీకాంత్ తో పూర్తి స్థాయి పాత్రలో నటించాలనేది తన కోరిక అని చెప్పింది.