Sudha: మా అబ్బాయి నా కాల్ కూడా లిఫ్ట్ చేయడు: సీనియర్ నటి సుధ

Sudha Interview
షార్ట్స్‌లో చూడండి
తెలుగులో సీనియర్ కేరక్టర్ ఆర్టిస్టుగా సుధా కనిపిస్తారు. అమ్మగా .. అక్కగా .. వదినగా ఆమె అనేక పాత్రలలో మెప్పించారు. అలాంటి సుధ తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. నాకు ఒక అమ్మాయి .. ఒక అబ్బాయి. ఇద్దరికీ పెళ్లిళ్లు చేశాను. ఇద్దరితోను నేను చాలా ఫ్రెండ్లీగా ఉండేదానిని" అని అన్నారు. 

" మా అబ్బాయి ఫారిన్ లోనే స్థిరపడ్డాడు .. ఫారిన్ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. నాకు కోపం వచ్చినా ఒప్పుకోక తప్పలేదు. మా అబ్బాయి ... కోడలు ఇద్దరూ కూడా నాతో నాలుగేళ్లుగా మాట్లాడటం లేదు. నేను కాల్ చేసినా లిఫ్ట్ చేయరు. అలా అని చెప్పి నేనేమీ వాళ్లను తిట్టుకోను .. ఏదో ఒకనాటికి వాళ్లే తెలుసుకుంటారని వదిలేశాను. వాళ్లు ఎక్కడున్నా సుఖంగా ఉండటమే నాకు కావలసింది" అని చెప్పారు. 

" మా అబ్బాయి .. కోడలు ఇద్దరూ కూడా ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను. వాళ్లు బాధపడతారేమోనని నేను బాధపడ్డాను. వాళ్లు హ్యాపీగా ఉంటే నాకూ ఆనందమే. నాకు ఎదురైన అనుభవాలు నన్ను ఇక్కడివరకూ నడిపించాయి. అవసరమైనప్పుడు నా పిల్లలకు ధైర్యం చెప్పడానికి అవి పనికొస్తాయి" అన్నారు.
Go Back to Shorts
Sudha
Actress
Interview
Tollywood

More Telugu News