Nedurumalli Ram Kumar: ఆనం వ్యాఖ్యలకు బదులిచ్చిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి

Nedurumalli Ram Kumar counters Anam comments
షార్ట్స్‌లో చూడండి
ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఓ వ్యక్తి తానే ఎమ్మెల్యేనంటూ చెప్పుకుంటున్నాడని, ఆ వ్యక్తి గతంలో ఎన్నికల మధ్యలోనే పారిపోయాడని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి వైసీపీ ఎమ్యెల్యే ఆనం రామనారాయణరెడ్డి పరోక్ష వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. 

దీనిపై నేదురుమల్లి రామ్ కుమార్ స్పందించారు. 2014 ఎన్నికల్లో తాను ఎక్కడికీ పారిపోలేదని, కౌంటింగ్ వరకు ఉన్నానని స్పష్టం చేశారు. సీటు కోసం వెంపర్లాడి టీడీపీలో చేరారని, నెల్లూరు టౌన్ నుంచి పోటీ చేయాలని వివేకా జయంతి అట్టహాసంగా జరిపింది ఎవరని రామ్ కుమార్ ప్రశ్నించారు. 

అటు, ఆనంపై రాష్ట్ర సంగీత అకాడమీ చైర్ పర్సన్ పొట్టేళ్ల శిరీష విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రభుత్వం ఎస్ఎస్ కెనాల్ అభివృద్ధిని పట్టించుకోవడంలేదని ఆనం చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. గతంలో ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న ఆనం ఎస్ఎస్ కెనాల్ గురించి ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. పూటకో పార్టీ మారుతూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆనంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇటీవల ఆనం చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే, మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నట్టుగా ఉందని శిరీష పేర్కొన్నారు.
Go Back to Shorts
Nedurumalli Ram Kumar
Anam Ramanarayana Reddy
YSRCP
Nellore District
Tirupati District

More Telugu News