Dil Raju: ఆ రెండు సినిమాలు కొట్టిన దెబ్బకి మరొకరైతే కోలుకోరు: దిల్ రాజు

  • డిస్ట్రిబ్యూషన్ లో పోటీ ఎక్కువన్న దిల్ రాజు 
  • మిస్ ఫైర్ కారణంగా డబ్బులు పోయాయని వివరణ 
  • నిర్మాతగా సక్సెస్ లు నిలబెట్టాయని వ్యాఖ్య
  • ముందుకు వెళ్లాలంటే రిస్క్ చేయవలసిందేనని వెల్లడి  
Dil Raju Interview

డిస్ట్రిబ్యూటర్ గా .. నిర్మాతగా దిల్ రాజుకి మంచి అనుభవం ఉంది. తాను ఎంచుకున్న ఈ రంగంలో అవగాహన పెరిగే లోగా .. అనుభవం వచ్చేలోగా చాలా నష్టపోయానంటూ తాజా ఇంటర్వ్యూలో ఆయన ఇలా చెప్పుకొచ్చారు. "నేను మొండివాణ్ణి .. నాకు నచ్చితే డిస్ట్రిబ్యూటర్ గా .. ప్రొడ్యూసర్ గా ఎక్కడివరకైనా వెళ్లి రిస్క్ చేస్తాను. ఇక్కడ చాలా పోటీ ఉంటుంది .. ఆ పోటీలో మనం ఉండక తప్పదు" అన్నారు. 

"ఎప్పుడైనా సరే .. సినిమా ఆడుతుందా లేదా అనేది జడ్జ్ చేసేవాడే మగాడు. ఈ సినిమాను మనం తీసుకోవచ్చు అని నేను జడ్జ్ చేస్తూ ఉంటాను. అలా తీసుకున్న సినిమాలు ఒక్కోసారి మిస్ ఫైర్ కూడా కావొచ్చు. మహేశ్ బాబు 'స్పైడర్' .. పవన్ 'అజ్ఞాతవాసి' డిస్ట్రిబ్యూటర్ గా నా కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డామేజ్. అయినా నేను తట్టుకుని నిలబడ్డాను" అని చెప్పారు. 

"నేను తట్టుకోవడానికి కారణం ఉంది. 2017లో నిర్మాతగా నేను వరుస సక్సెస్ లు చూడటం వలన, అక్కడ వచ్చిన డబ్బు ఇక్కడ పోయింది. అందువలన బ్యాలెన్స్ అయింది. అలా కాకుండా దగ్గరున్న డబ్బుపోతే ఎవడైనా సూసైడ్ చేసుకోవడమో .. ఇండస్ట్రీ నుంచి పారిపోవడంతో జరుగుతుంది. ఇక్కడ ముందుకు వెళ్లాలంటే రిస్క్ చేయవలసిందే" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News