ధోనీ కూతురుకు మెస్సీ కానుక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ధోనీ కూతురుకు మెస్సీ కానుక

Messi Gifts Signed Argentina Jersey To MS Dhoni Daughter Ziva
  • తన జెర్సీపై ఆటోగ్రాఫ్ చేసి పంపిన మెస్సీ
  • అది వేసుకుని మురిసిపోతున్న జివా ధోని
  • జెర్సీతో దిగిన ఫొటోను ఇన్ స్టాలో పెట్టిన జివా 
ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. తన అభిమాని, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూతురు జివా ధోనికి గిఫ్ట్ పంపించాడు. తన జెర్సీపై ఆటోగ్రాఫ్ చేసి జివాకు పంపించాడు. అభిమాన ఆటగాడి నుంచి అందిన కానుకను చూసుకుంటూ జివా ధోని మురిసిపోతోంది. ఆ జెర్సీ వేసుకుని తీసుకున్న ఫొటోను ఇన్ స్టాలో అప్ లోడ్ చేసింది. ఈ ఫొటోలో జెర్సీపై పారా జివా(జివా కోసం) అంటూ మెస్సీ చేసిన సంతకం కనిపిస్తోంది.

క్రికెట్ తో పాటు ఫుట్ బాల్ తనకెంతో ఇష్టమైన ఆట అంటూ మహేంద్ర సింగ్ ధోని గతంలో చాలాసార్లు చెప్పారు. తండ్రిలాగే జివాకు కూడా ఫుట్ బాల్ ఆటంటే చాలా ఇష్టం. అర్జెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీ ఆటను తండ్రితో కలిసి చూస్తుంటుంది. ఈ క్రమంలో మెస్సీ ఆటోగ్రాప్ చేసిన జెర్సీ అందుకోవడంపై జివా సంతోషం వ్యక్తంచేస్తోంది. ఇన్ స్టా వేదికగా తన సంతోషాన్ని పంచుకుంది.
Advertisement
ziva dhoni
messi
autograph
jersi
arzentina
football

More Telugu News