ఆయన నా తమ్ముడయ్యా స్వామీ: వైఎస్ జగన్

  • ఎంపీ అవినాశ్ గురించి సీఎం జగన్ కామెంట్ 
  • పులివెందులలో జగన్ కు అర్జీ ఇవ్వబోయిన వ్యక్తి
  • అవినాశ్ కు ఇవ్వాలని సూచించిన సీఎం జగన్
ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘నా తమ్ముడయ్యా స్వామీ.. ఎవరో కాదు’ అంటూ ఓ వ్యక్తితో జగన్ అంటున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మూడు రోజుల పర్యటన ముగించుకొని సీఎం జగన్ ఆదివారం పులివెందుల నుంచి తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ పరిణామం చోటు చేసుకుంది. 

సీఎం జగన్ హెలిప్యాడ్ వద్దకు వెళ్తుండగా.. ఓ వ్యక్తి అర్జీ ఇవ్వడానికి వచ్చారు. దాంతో జగన్.. అర్జీని పక్కనే ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డికి అందజేయమని సూచించారు. అయినప్పటికీ సదరు వ్యక్తి జగన్ కే ఇవ్వబోతుండగా.. ‘నా తమ్ముడయ్యా స్వామీ.. ఆయన ఎవరో కాదు’ అంటూ అవినాశ్ కే ఇవ్వమన్నారు. అర్జీ తీసుకోవాలని ఎంపీ అవినాశ్ కు సైతం చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది.


More Telugu News

Andhra Pradesh YS Jagan mp ys avinash kadapa