Chiranjeevi: చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' టైటిల్ సాంగ్ విడుదల

Title song released from Chiranjeevi Waltair Veerayya
షార్ట్స్‌లో చూడండి
మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో వస్తున్న 'వాల్తేరు వీరయ్య' చిత్రం నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ గీతాన్ని అనురాగ్ కులకర్ణి, పవిత్ర చారి ఆలపించారు. 

బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. రవితేజ ఓ పవర్ ఫుల్ రోల్ పోషిస్తుండడం విశేషం. ఇందులో కేథరిన్ ట్రెసా కూడా నటిస్తోంది. 

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో యాక్షన్ ఎంటర్టయినర్ గా రూపుదిద్దుకుంటున్న 'వాల్తేరు వీరయ్య' చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతుండడంతో థియేట్రికల్ ట్రైలర్ ను జనవరి 4న తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Go Back to Shorts
Chiranjeevi
Waltair Veerayya
Title Song
Bobby
Tollywood

More Telugu News