తిరుమలలో జనవరి 2 నుంచి వైకుంఠద్వార దర్శనం... 1వ తేదీ నుంచి టోకెన్ల జారీ
- జనవరి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం
- జనవరి 1 నుంచి టోకెన్ల జారీ
- ఆఫ్ లైన్ లో టోకెన్లు
- తిరుపతిలో 9 చోట్ల టోకెన్ల జారీ
తిరుపతిలోని శ్రీనివాసం, తుడా ఇందిరా మైదానం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజ సత్రాలు, శేషాద్రినగర్ జడ్పీ హైస్కూల్, రామచంద్ర పుష్కరిణి, జీవకోన జడ్పీ హైస్కూల్, బైరాగిపట్టెడ జడ్పీ హైస్కూల్ లో టోకెన్లు జారీ చేయనున్నారు.