వంగవీటి రంగాను చంపిన వాళ్లు టీడీపీలోనే ఉన్నారు: కొడాలి నాని

  • రంగాను చంపిన వాళ్లే ఆయన ఫొటోలకు దండలు వేస్తున్నారన్న నాని 
  • తాను రంగా కుటుంబంలో ఒక సభ్యుడినని వివరణ 
  • వంగవీటి రాధాతో తనకు రాజకీయాలకు అతీతమైన అనుబంధం ఉందని వెల్లడి 
వంగవీటి మోహన రంగాను చంపింది టీడీపీనే అని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. రంగాను చంపిన వాళ్లు టీడీపీలోనే ఉన్నారని చెప్పారు. రంగా టీడీపీతో విభేదించి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని... దీంతో ఆయనను అణచి వేయాలని టీడీపీ నేతలు చూశారని అన్నారు. రంగా చావుకు కారణమైన వ్యక్తులు ఆయన ఫొటోకే దండలు వేసి, బూట్లు నాకుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రంగా మద్దతుదారుల ఓట్లు రాకుండా పోతాయనే భయంతో టీడీపీ డ్రామాలు చేస్తోందని మండిపడ్డారు. 

ఎన్టీఆర్, రంగా, అంబేద్కర్ వంటి వారు పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తులని కొడాలి నాని అన్నారు. వంగవీటి రంగాను ఓన్ చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని... తాను రంగా కుటుంబంలో సభ్యుడినని చెప్పారు. వంగవీటి రాధాకు, తనకు రాజకీయాలకు అతీతమైన అనుబంధం ఉందని అన్నారు. తమ ప్రభుత్వం అన్ని హామీలను నెరవేర్చిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది వైసీపీనే అని ధీమా వ్యక్తం చేశారు.

Kodali Nani
YSRCP
Vangaveeti Ranga
Telugudesam

More Telugu News