Andhra Pradesh: బాపట్ల జిల్లాలో విజయవాడ–ఒంగోలు హైవే పై దిగనున్న విమానాలు

  • 16వ నంబర్ హైవేపై 4 కిలోమీటర్లను ఎయిర్ పాడ్ గా తీర్చిదిద్దిన వైనం
  • అత్యవసర సమయాల్లో ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు
  • ఈ నెల 29న ట్రయల్ రన్
Flights will land on the Vijayawada Ongole highway in Bapatla

అత్యవసర సమాయాల్లో విమానాలను సాధారణ హైవేలపై దింపుతారు. ఇందుకోసం హైవేల్లో కొన్ని కిలోమీటర్ల మేర రోడ్డును ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. విదేశాల్లో ఇలాంటి నిర్మాణాలు సాధారణం. ఈ మధ్య భారత్ లోనూ విమానాలు దిగేలా హైవేలను మారుస్తున్నారు. ఉత్తరాదిలో, సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనూ విమానాలు దిగేలా ఓ హైవేను తీర్చిదిద్దారు. 16వ నంబర్ జాతీయ రహదారిపై విజయవాడ–ఒంగోలు మధ్య ఎయిర్ పాడ్ ను తీర్చిదిద్దారు. 

బాపట్ల జిల్లా జె. పంగులూరు మండలం రేణింగవరం, కొరిశపాడు గ్రామాల మధ్య హైవేపై 4 కిలోమీటర్ల మేర విమానాలు దిగేలా సిమెంట్ రోడ్డు వేశారు. ఈ నెల 29వ తేదీన దీనిపై ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం 11 గంటల ప్రాంతాల్లో ఒక కార్గో విమానంతో పాటు రెండు ఫైటర్ జెట్ విమానాలు దిగుతాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో హైవే, సమీపంలోకి ఇతర వాహనాలు రాకుండా ట్రాఫిక్ ను మళ్లిస్తామని అధికారులు తెలిపారు.

More Telugu News