Christmas: మానవాళికి క్రీస్తు అందించిన గొప్ప సందేశాలు ప్రేమ.. త్యాగం: జగన్

YS Jagan Wishes AP People On Christmas Eve
షార్ట్స్‌లో చూడండి
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం వంటి వాటిని క్రీస్తు తన జీవితం ద్వారా మానవాళికి అందించించిన గొప్ప సందేశాలని పేర్కొన్నారు. 

రాష్ట్ర ప్రజలకు కరుణామయుడి ఆశీస్సులు, దీవెనలు లభించాలని జగన్ ఆకాంక్షించారు. కాగా, ఆదివారం ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరుపుకోనున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, అచ్చెన్నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
Go Back to Shorts
Christmas
Andhra Pradesh
YSRCP
YS Jagan

More Telugu News