మానవాళికి క్రీస్తు అందించిన గొప్ప సందేశాలు ప్రేమ.. త్యాగం: జగన్

  • ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం
  • కరుణామయుడి ఆశీస్సులు అందరికీ ఉండాలన్న జగన్
  • రేపు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరుపుకోనున్న క్రైస్తవులు
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం వంటి వాటిని క్రీస్తు తన జీవితం ద్వారా మానవాళికి అందించించిన గొప్ప సందేశాలని పేర్కొన్నారు. 

రాష్ట్ర ప్రజలకు కరుణామయుడి ఆశీస్సులు, దీవెనలు లభించాలని జగన్ ఆకాంక్షించారు. కాగా, ఆదివారం ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరుపుకోనున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, అచ్చెన్నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.


More Telugu News

Christmas Andhra Pradesh YSRCP YS Jagan